వంట చేయడం ఒక ఆర్టు. మరి చికెన్ కర్రీ చేయడమంటే నాన్ వెజ్ లవ్వర్స్ కి చిన్నసైజ్ బాహుబలి ప్రాజెక్ట్ !. చెడగొడతారనే భయంతో అరకొర తెలిసిన వంటవాళ్ళని చెయ్యితిరిగినవాళ్ళు అసలు వంటగదిలోకి కూడా రానివ్వరు. మరి ఇంత ప్రాధాన్యత ఇస్తూ వండే ఈ కర్రీకి అనవసర పదార్థాలు తగిలించి అడ్డదిడ్డంగా వండితే, ప్రాణం పెట్టివండుకునే చికెన్ లవ్వర్స్ కి ఎంత చిరాగ్గా ఉంటుంది.? ఎత చిర్రెత్తుకొస్తుంది ?.
రీసెంట్ గా ఓ యూకే ఫుడ్ ఛానెల్ రిలీజ్ చేసిన “వన్ -పాట్ చికెన్ కుర్మా”ని చూసి సాంప్రదాయ చికెన్ లవ్వర్స్ కామెంట్లతో కస్సుమంటున్నారు.
టేస్టీయూకు అనే పేజ్ ఈ వైరల్ వీడియోని ట్విట్టర్లో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ వంటకం ‘వన్ పాట్ చికెన్ కుర్మా’ క్యాప్షన్ తో హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఈ చికెన్ కర్రీని పది లక్షల మంది వీక్షించగా చిరాకు పడుతూ చూసిన వాళ్ళే ఎక్కువని కామెంట్స్ చెబుతున్నాయ్.
One-Pot Chicken Korma 😍 pic.twitter.com/pQDerTbyZX
— Tasty UK (@TastyUK) December 3, 2022
ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసి, ఉల్లి,వెల్లుల్లిని వేయించారు. ఆపై చికెన్ ముక్కలు, టొమాటోలను కుర్మా పేస్ట్ కలిపి బాస్మతి రైస్‌తో ఉడికించారు. ఆపై నీరు, కిస్‌మిస్‌లు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత రెసిపీకి పాలకూర, పైన్ నట్స్, పెరుగు, కొత్తిమీర జోడించారు.ఈ డిష్ తయారు చేసే విధానికే డోకు వస్తుందంటున్నారు దేశీ నెటిజన్లఅసలు ఇదేం డిష్ అంటూ మండిపడ్డారు. అసలు మీ టీంలో ఎవరికైనా కుకింగ్ వచ్చా అంటూ ఓ యూజర్ ఆడుకున్నారు.ఇదేం అరాచకం అంటూ మరో యూజర్ కామెంట్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.