సినిమా పరిశ్రమలో స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ కొడితే డైరెక్టర్ కు మంచి పేరు వస్తుంది అనే మాట నిజం. ఆ ఇమేజ్ తర్వాత వాళ్లకు మంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి. కథ బాగుంది అనుకుంటే చాలు నిర్మాతలు క్యూ కడతారు. యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ సినిమా చేయడానికి ఓకే చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే ఇద్దరు దర్శకుల పరిస్థితి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆ ఇద్దరు ఎవరో చూద్దాం.
సాగర్ కే చంద్ర
భీమ్లా నాయక్ సినిమా చేసిన ఈ దర్శకుడు హిట్ కొట్టాడు. సినిమా మీద కాస్తో కూస్తో విమర్శలు వచ్చినా సరే తర్వాత మాత్రం కెరీర్ కి ఆ సినిమా ప్లస్ అవుతుంది అనుకున్నారు. కాని ఆ సినిమాను ఎక్కువగా డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్ అనే కామెంట్ బయటకు రావడంతో సాగర్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు అనే చెప్పాలి.
వేణు శ్రీరాం
వకీల్ సాబ్ అనే సినిమాను బాగానే తీసినా… ఈ సినిమా తర్వాత వేణుకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడనే టాక్ వచ్చింది. ఆ సినిమా కొంచెం చేసి ఆగిపోయింది. కాని ముందుకు మాత్రం వెళ్ళడం లేదు. మరి తర్వాత అయినా వేరే హీరోతో సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.