దేవని సతీష్ మాదిగ, TPCC అధికార ప్రతినిధి
టీఆర్ఎస్ అచ్చంపేట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్.. నువ్ నోరు అదుపులో పెట్టుకో.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని వల్గర్ భాషతో మాట్లాడుతున్నావ్.. హీరో అనుకుంటున్నవ్… నీకు గూటం దెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నవ్…
రేవంత్‌రెడ్డి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడ్డం వల్లే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అది అందరికీ తెలుసు.
గతంలో ఎస్‌సీ వర్గీకరణకు, బీసీలకు 50 శాతం రిజర్వేషన్, గిరిజనులకు 12 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. అ తీర్మానాలు బుట్టలో వేశారు.
యురేనియం తీర్మానం కూడా బుట్టలో వేయరని గ్యారెంటీ ఏమిటి ? ఈ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు. నిజంగానే నల్లమలలో యురేనియం తవ్వకాలు జరుపకూడదని ప్రభుత్వానికి ఉంటే 2016లో రాష్ట్ర ఫారెస్ట్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్‌గా కేసీఆర్, మెంబర్‌గా గువ్వల బాలరాజ్ వుండీ నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. మీరు, ఆ తీర్మానాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వమని బోర్డ్ తరుపున కేంద్రానికి లేఖ రాయాలి.
యురేనియం తవ్వకాలకు కారణం కాంగ్రెస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న కేసీఆర్, నిజంగానే కాంగ్రెస్ అనుమతులు ఉంటే మళ్ళీ మీరు ఎందుకు కొత్తగా అనుమతులు ఇచ్చారు?
కాంగ్రెస్ ఇచ్చిన అనుమతులు 2009 నుంచి 2012 వరకే పరిమితం అని మీకు తెలుసు, కనుకనే మళ్ళీ మీరు అనుమతులు ఇచ్చారు.
గువ్వల మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు, ED కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ కేసులలో పస లేదని మీ కేసీఆర్‌కు తెలియదా, కోర్టులో వీగిపోయాయి అన్న సంగతి మరిచారా?
మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా జాతీయ అధ్యక్షురాలిని కలిస్తే మీకు గుబులెందుకు ? బాలరాజ్.. నీవు నిజంగా మాదిగ బిడ్డను అనుకుంటే మీ ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవి లేదు, మీరు అపార్టీలో ఉండి ఏమి పీకుతున్నారు…?
ఎస్‌సీ వర్గీకరణ గురించి మాట్లాడు.. ప్రశ్నించే గొంతుగా పేరు పొందిన రేవంత్ రెడ్డిని నీ కులం అడ్డు పెట్టుకొని మాట్లాడితే మాదిగల చేతనే నీకు గూటం దెబ్బలు తప్పవని నల్లమల అడవి బిడ్డగా హెచ్చరిస్తున్నా…
అసెంబ్లీలో వర్గీకరణ గురించి మాట్లాడి సభనుంచి బహిష్కరణకు గురైన రేవంత్ రెడ్డి నిజంగా మాదిగలకు అండ… అది నీకు చెప్పదలచుకున్నా…