విశాఖపట్నం: ఎవరైనా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి సమస్య పరిష్కారం చేయామని దేవుణ్ని కోరుకుంటారు. సేమ్ టు సేమ్.. దేవరపల్లి గ్రామం గిరిజనులు ఎంపీడీవో కార్యాలయానికి పూజలు చేసి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇంతకీ వీరేం చేశారంటే.. దేవరాపల్లి మండలంలోని వాలాబు పంచాయతీ మంచినీటి సమస్య పరిష్కారం కోసం గిరిజనులు ఏం చేయాలా అని తెగ ఆలోచించారు. దేవుడికి పూజ చేసి ఎలా అయితే మొక్కుకుంటామో ఇక్కడ కూడా ఆఫీసర్లు అనే దేవుళ్లని అలాగే మొక్కుకుని మొర పెట్టుకుందామనుకున్నారు వాలాబు గ్రామానికి చెందిన గిరిజనులు. అనుకున్నదే తడవు, అందరూ కలిసి బయల్డేరారు. టెంకాయలు కొని దేవరాపల్లి మండల అభివృద్ధి అధికారి కార్యాలయానికి వచ్చారు. అక్కడే కొబ్బరికారులు కొట్టి ఎంపీడీవో ఆఫీసులో గది గదికీ పూజలు చేశారు. తర్వాత ఖాళీ బిందెలతో అదే ఆఫీసు ముందు ధర్నా చేశారు. సమస్య పరిష్కరించాలని డిమాండు చేశారు
Tolivelugu Latest Telugu Breaking News » Viral » మొక్కి మొరపెట్టుకున్నారు!