కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం లేదని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని బీజేపీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.
ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులను అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో డీకే అరుణ తన నివాసంలో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శక్తి కేంద్ర ఇన్ ఛార్జీలు, కార్యకర్తలు ఈ కార్నర్ సమావేశాలు విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని,కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు తెలంగాణ రోడ్లకు ఖర్చు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాయ్ చూర్ నుంచి గద్వాల మీదుగా ఎర్రవల్లి వరకు నేషనల్ హైవే కలపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆమె అన్నారు.