టీడీపీకి మరో యువనేత గుడ్‌బై చెప్పారు. తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు, టి.వీరేందర్ గౌడ్ చంద్రబాబు పార్టీకి రాజీనామా చేశారు. వీరేందర్ త్వరలో బీజేపీ గూటిలోకి చేరనున్నారు
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీలో సీనీయర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ తెలుగుయువత అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు రాజీనామా చేసినట్టుగా లేఖ రాశారు. అక్టోబరు 3న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన భారతీయ జనతాపార్టీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఉప్పల్ నుండి మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వీరేందర్ టీడీపీలో తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వీరేందర్‌గౌడ్‌తో తనతో పాటు తండ్రిని కూడా తీసుకెళ్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.