ఫడ్నవీస్ హడావుడి ప్రమాణ స్వీకార రహస్యం ఇదా..!? - Tolivelugu

ఫడ్నవీస్ హడావుడి ప్రమాణ స్వీకార రహస్యం ఇదా..!?

Devendra Fadnavis Oath A 'Drama To Protect Rs Forty Thousand Crore': BJP Leader, ఫడ్నవీస్ హడావుడి ప్రమాణ స్వీకార రహస్యం ఇదా..!?
తనకు తగినంత మెజార్టీ లేదని తెలిసినప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం వెనుక రహస్యాన్ని బీజేపీ ఎంపీ ఒకరు బట్టబయలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న రూ.40000 కోట్ల రూపాయలను కేంద్రానికి తిరిగి అప్పగించేందుకే ఈ ప్రమాణ స్వీకారం డ్రామా ఆడారని కర్ణాటకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, సొంత పార్టీ ఎంపీ అనడం బీజేపీలో కలకలం రేపింది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు శివసేన కూటమి ప్రకటించిన 15 గంటల్లోనే రహస్యంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం వెనుక అసలు కథ ఇది అన్నారు. 80 గంటల్లో ఆ డబ్బులు చేరాల్సిన చోటుకు చేరాయన్నారు. ఉత్తర కన్నడ లోని ఎల్లపోర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రూ.40000 కోట్ల నిధులు ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నాయని..కొత్త ప్రభుత్వం వస్తే వాటిని దుర్వినియోగం చేస్తుందని భావించిన బీజేపీ ఈ పని చేసిందన్నారు. ఈ విషయాన్ని తాను దేవేంద్ర ఫడ్నవీస్ తో నిర్ధారించుకన్నట్టు కూడా చెప్పారు.

సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. తాను అధికారంలో ఉన్న ఆ కొన్ని గంటల్లో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆర్ధిక శాఖ దర్యాప్తు చేసుకోవచ్చన్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp