హీరో ఆనంద్ దేవరకొండకు అందమైన అమ్మాయి కావాలంటే. ఆ అమ్మాయి వయసు ఎంత ఉండాలో కూడా తనే చెబుతున్నాడు. అయితే ఆ అమ్మాయిని అతడు అడుగుంతోంది పెళ్లి చేసుకోవడం కోసం కాదు, తన సరసన నటించడం కోసం. అవును.. తన కొత్త సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాడు ఈ హీరో.
రీసెంట్ గా గం..గం..గణేషా అనే కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు ఆనంద్ దేవరకొండ. యాక్షన్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమాతో కొత్త నటీనటుల్ని పరిచయం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో వివిధ పాత్రల కోసం 25 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న నటులు కావాలంట. ఇక హీరోయిన్ పాత్ర కోసం 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయి కావాలంట. ఆసక్తి ఉన్న వాళ్లు వెంటనే సంప్రదించాలంటూ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణంగా తన కెరీర్ ను మలుచుకుంటున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. కంటెంట్ ఉన్న కథల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. తాజా చిత్రం కూడా ఇలాంటిదే. “గం..గం..గణేశా” చిత్రాన్ని ఈమధ్యే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.