వ్యక్తిగత జీవితాల కన్నా మనల్ని నమ్ముకున్న వారే ముఖ్యం, వారి శ్రేయస్సు కోసం మనం పనిచేయాలన్న మానాన్న గారి మాటకు కట్టుబడి ఉన్నానని, మా కష్టానికి పార్టీలో తగిన ప్రతిఫలం లేని కారణంగానే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్. కార్యకర్తల నిర్ణయం మేరకు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబు.