విజయవాడ : ప్రజా రాజధాని అమరావతి రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అమరావతిపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని, 34 వేల ఎకరాలను లాభాపేక్ష లేకుండా ప్రజా రాజధాని కోసం రైతులు త్యాగం చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు కుట్రలు చేసి రాజధానిని తరలించాలని చూస్తోందని ఆరోపించారు. రాజధానిని దొనకొండకో, ఇడుపులపాయకో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వంద రోజుల జగన్ పరిపాలనలో చేసిందేమీ లేదని, ఇసుక రద్దు చేసి లక్షలాది మంది భవననిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, అన్న క్యాంటీన్లను మూసేసి దాదాపు కోటిమంది అభాగ్యుల పొట్ట కొట్టారని విమర్శించారు.