పత్తా లేని మంత్రి...సమాధానం చెప్పని ముఖ్య మంత్రి .... - Tolivelugu

పత్తా లేని మంత్రి…సమాధానం చెప్పని ముఖ్య మంత్రి ….

devineni uma comments on ys jagan govt over polavaram project, పత్తా లేని మంత్రి…సమాధానం చెప్పని ముఖ్య మంత్రి ….

ప్రభుత్వ అసమర్ధత కారణంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఆగిపోయినా మంత్రి పత్తా లేరని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్ రావు విమర్శించారు. దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముంచడానికి మీకు అధికారం కావాలా? అని ప్రశ్నించారు. మునిగిపోతున్న జగన్‌ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఏ ధర్మాడి సత్యం లేడన్నారు. పోలవరం పనులు ఎందుకు నత్తనడకన జరుగుతున్నాయని దేవినేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇష్టారాజ్యాంగా కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను మారిస్తే.. పోలవరం ప్రాజెక్టు భద్రత ఎవరిదని పీఏసీ ప్రశ్నించిందని, రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బును కేంద్రం చెల్లించడానికి జగన్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా ఎందుకు ప్రయత్నించ లేదని దేవినేని ఉమా అడిగారు. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారని ఆయన నిలదీశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం ఈ ప్రభుత్వ నిర్వాకం కాదా? అని అన్నారు. పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని…జగన్ బంధువు పీటర్‌తో తప్పుడు నివేధిక ఇప్పించారని దేవినేని ఉమా ఆరోపించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp