బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూసిందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అయితే ఏపీలోనూ కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందిందటూ మాజీ మంత్రి దేవినేని ఓ హాట్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఈ కామెంట్స్ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేశారు.
కేవలం ప్రతిపక్షాలు , ప్రజలు నిరసన తెలిపితేనే కరోనా పేరుతో ప్రభుత్వం అడ్టుకుంటోందని.. కేసులు పెడుతోందని దేవినేని ఆరోపించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు కూడా కరోనా అడ్డంకిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోందన్న ఆయన.. వైసీసీ సభలు, పాదయాత్రలు, పుట్టిన రోజులకి మాత్రం కరోనా అడ్డంకిగా మారడం లేదని అన్నారు. వారికి ఈ వైరస్ సోకదేమో అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 25న పంపిణీ చేస్తామన్న వ్యాక్సిన్ దీనికేనా అంటూ సెటైర్ వేశారు. అలాగే జగన్ బర్త్ డే సందర్భంగా వైసీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
దేవినేని చేసిన ట్వీట్ ఇదే..
ఏపీలో కొత్తరకం కరోనా. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుంది,కేసులు పెడుతుంది. స్థానికఎన్నికలకు అడ్డంకిగా ఉంటుంది. వైసీపీ సభలు,పాదయాత్రలు,పుట్టినరోజు వేడుకలకి అడ్డంకికాదు. వారికి ఈవైరస్ సోకదు.25న @VSReddy_MP పంపిణి చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?@ysjagan pic.twitter.com/AGdHQ1grn9
— Devineni Uma (@DevineniUma) December 22, 2020