రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం జగన్ కలిసి విశాఖకు రాజధాని తరలింపుయత్నం చేస్తున్నారని విమర్శించారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ.రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతినే కొనసాగించాలని, లేకపోతే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు ఉమ. పోలీసులు, ఉన్నతాధికారులు జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించిన ఆయన అప్పుడు వైఎస్సాఆర్ ని నమ్మి అధికారులు సీబీఐ కేసుల్లో ఇరుక్కుంటే ఇప్పుడు జగన్ నమ్మి జైలుపాలయ్యేలా ఉన్నారని విమర్శించారు దేవినేని. ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ ఓ చెత్త కమిటీ అని కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ రైతుపేట నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.