రాజధాని గ్రామాల నుంచి వెళ్లే ధైర్యం జగన్‌కు లేదని, రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులు చేతకాని దద్దమ్మలు, అసమర్ధులుగా తయారయ్యారన్నారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. మీకు సిగ్గు, శరం ఉంటే రాజధాని ప్రాంత ప్రజల కన్నీరు చూసి మీ పదవులకు రాజీనామాలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. ప్రజలపక్షాన పోరాడుతున్న టిడిపి మహిళా నేతలపై బెదిరింపులు మానుకోవాలని హెచ్చరించారు.
రాజ్యంగేతర శక్తిగా, అవినీతి కేసులో ఎ2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి రాజధాని పై ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. క్యాబినెట్ లో చర్చించి మంత్రులు చేయాల్సిన ప్రకటనను ఆయన చేయడం పై జగన్ వివరణ ఇవ్వాలని దేవినేని డిమాండ్ చేశారు జి.యన్.రావు వంద మీటర్లు కూడా నడవలేడు. పదివేల కిలోమీటర్ల నడిచారంటే నమ్ముతారా, జి.యన్. రావు అసలు ఎవరెవరిని కలిశారో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా గోపవరంకు చెందిన ఆయన రిపోర్ట్ లో అసలు నిబద్ధత ఉందా ఈ నివేదిక పై సిబిఐ కూడా విచారించాలని డిమాండ్ చేశారు.