విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇంత ఘోరం జరిగిన తరువాత కూడా ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు.
12 మంది చనిపోయి వేలాది మంది నిరాశ్రయులైతే పర్యావరణ ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘన, వాటర్, ఎయిర్ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు లేవు. మీరు చెప్పే పేరున్న మంచి ఎల్జీ కంపెనీలో అలారం మోగదు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడంలేదో ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.