మెగాస్టార్ చిరంజీవి, మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి అందరికీ తెలుసు. చిరు సినిమాలు ఆపేయడానికి ముందు వరకు దేవిశ్రీనే ఆయనకు సంగీతం అందించాడు. మళ్లీ లాంగ్ గ్యాప్ ఇచ్చి మళ్లీ మెగాస్టార్ మూవీస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా దేవిశ్రీనే మ్యూజిక్ అందించాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక చిన్న తేడా ఉంది.
చిరంజీవి సినిమాలు ఆపేయడానికి ముందు శంకర్ దాదా లాంటి సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఆ టైమ్ లో వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఓ పాటలో చిరంజీవితో పాటు డీఎస్పీ కనిపించాడు. చిరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆ సీన్ రిపీట్ కాలేదు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది.
చిరంజీవి, దేవిశ్రీప్రసాద్ కలిసి ఓ సినిమాలో కనిపించబోతున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం అదిరిపోయే మాస్ నంబర్ కంపోజ్ చేశాడు. ఈ పాటలో చిరంజీవితో పాటు తెరపై కనిపించబోతున్నాడు. ఈ మేరకు ముందే దర్శకుడి నుంచి డీఎస్పీ మాట తీసుకున్నాడట. సాంగ్ షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 పాటలు కంపోజ్ చేశాడు డీఎస్పీ. నిజానికి ఈ సినిమా కోసం 5 పాటలిచ్చాడట. అయితే.. ఆచార్య దెబ్బ తర్వాత మరింత జాగ్రత్తపడిన చిరంజీవి.. 5 పాటల్లోంచి 2 పక్కనపెట్టారట. మిగతా పాటల కోసం ఇప్పుడు దేవిశ్రీ మరోసారి వర్క్ స్టార్ట్ చేశాడట.