తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ధర్మకర్తల మండలి వెంటనే ఉపసంహరించుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేశారు. ఏపీలో మూడు రాజధానులపై జరుగుతున్న ముక్కోణపు పోటీతో రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిట్టే.. తిరుమలకు మూడు ఘాట్ రోడ్ల ప్రతిపాదనతో తిరుపతి అభివృద్ధి కూడా ఎడారిలో ఎండమావిలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీ ధర్మకర్తల మండలి తొందరపాటు నిర్ణయాలతో తిరుపతి నగర ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు భక్తులు. మూడవ ఘాట్ రోడ్డుతో తిరుమల సన్నిధిలోని చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. తమ పొట్టకొట్టొద్దని వ్యాపారాల మీద ఆధారపడి జీవిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.