యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడం, స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.