గురువారం ఏపీలో ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉద్యోగులను ఆపలేకపోయారు. ఇక ఇదే విషయమై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని గురించి డీజీపీని జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కొంతమంది పోలీసులే ఉద్యోగులకు సహకరించారని అనిపిస్తుందని అన్నారట జగన్. నిజానికి పోలీసులు చాలా తక్కువ మంది ఉద్యోగులు వస్తారని అంచనా వేసుకున్నారట. కానీ నాలుగు కిలోమీటర్ల మేర ఉన్నబీఆర్టీఎస్ రోడ్డు నిమిషాల్లో ఉద్యోగుల తో నిండిపోయింది.
మొత్తం వీటన్నింటికీ సంబంధించి పూర్తి వివరాలను డీజీపీ ని అడిగి తెలుసుకున్నారట జగన్. గౌతమ్ సవాంగ్ కూడా జగన్ కు పోలీసులు తీసుకున్న చర్యలు, ప్రయత్నాల గురించి వివరించారట.
మారువేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారని అలానే విజయవాడలో ముందుగానే వచ్చి కొత్తమంది బస కూడా చేశారని తెలిపారట. ఇక ఇదే విషయమై భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి పలు సూచనలు డీజీపీకి జగన్ చేశారట.