బాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్ స్టార్ గా పిలుస్తుంటారు అభిమానులు. ఎప్పుడు ఏదో ఒక వివాదాలతో వార్తల్లో ఉండే ఈ అమ్మడు.. సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ.. ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది.
రిలీజ్ కి ముందు వచ్చిన ప్రోమోలు, ట్రైలర్స్ చూసి.. ‘ధాకడ్’ సినిమా ఒక లేడీ ర్యాంబో మూవీగా బాలీవుడ్ లో సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఇది అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో.. మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ళు దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. ఎనిమిదో రోజు అయితే కలెక్షన్లు మరీ ఘోరంగా వచ్చాయి.
దేశం మొత్తం మీద కేవలం 20 టికెట్లే అమ్ముడుపోయాయి. దీంతో.. కలెక్షన్లు రూ. 4420 మాత్రమే వచ్చాయి. కంగనా లాంటి స్టార్ హీరోయిన్ సినిమా ఇంత చెత్త వసూళ్ళను కలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం.
ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ. 90 కోట్లు. ఇప్పటివరకూ ఇది నమోదు చేసిన షేర్ రూ. 5 కోట్లలోపే బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన.. నష్టాలు రూ. 85 కోట్ల పైమాటే అంటున్నారు. దీంతో.. ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చిన బిగ్జెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరిందంటున్నారు సినీ ప్రముఖులు.