క్రాక్ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన రవితేజ, ఎట్టకేలకు మరో హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో దుమ్ముదులిపాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. తాజాగా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి కూడా చేరింది. రవితేజ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమా ఇదే.
తాజాగా ఈ సినిమా 2 వారాల రన్ పూర్తి చేసుకుంది. విడుదలైన 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, ఈ 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లందరికీ లాభాలు అందిస్తోంది.
ఏపీ,నైజాం నుంచి ఈ సినిమాకు 2 వారాల్లో 60 కోట్ల 51 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే దీని విలువ 33 కోట్ల 18 లక్షలు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 16 కోట్ల రూపాయలకు అమ్మారు. ప్రస్తుతం 33 కోట్లు వచ్చాయి. అంటే ఏపీ-నైజాంలో ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో ధమాకా సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – 15.84Cr
సీడెడ్ – 6.34Cr
ఉత్తరాంధ్ర – 4.08Cr
ఈస్ట్ – 1.63Cr
వెస్ట్ – 1.17Cr
గుంటూరు – 1.66Cr
కృష్ణా – 1.60Cr
నెల్లూరు – 86L