మాస్ మహారాజా రవితేజ డబుల్ ఇంపాక్ట్ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ధమాకా అనే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఏస్ త్రినాధ రావు నక్కినతో రవితేజ ఈ సినిమా చేస్తున్నాడు. కాగా నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
రవితేజ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చారల చొక్కా, నలుపు జీన్స్‌లో రవితేజ, అల్ట్రా స్టైలిష్ లో కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనితో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమా లు చేస్తున్నాడు.
క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం అదే జోష్ తో వరుస సినిమాలను లైన్ పెడుతున్నాడు. ఇవి గాని సక్సెస్ అయితే రవితేజ కెరీర్ మళ్లీ మారినట్టే.