థియేటర్లలో సూపర్ హిట్టయిన ధమాకా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా రాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంత సూపర్ హిట్ సినిమాను క్యాష్ చేసుకోవడంలో నెట్ ఫ్లిక్స్ ఫెయిల్ అయింది.
ఓ హిట్ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేటప్పుడు అమెజాన్, జీ5, ఆహా లాంటి సంస్థలు గట్టిగా ప్రచారం చేస్తాయి. అలా నెటిజన్లను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది. ఓ తేదీ ఫిక్స్ చేసుకొని సింపుల్ గా సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేస్తుంది.
ధమాకా సినిమా ఓటీటీలోకి వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు. కేవలం తన సోషల్ మీడియా పేజీలో మాత్రమే నెట్ ఫ్లిక్స్ ప్రకటన ఇచ్చి సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది. దీంతో చాలామంది తెలుగు ప్రేక్షకులు ధమాకా వచ్చిందనే విషయాన్ని గుర్తించలేకపోయారు.
రీసెంట్ గా రవితేజ అందుకున్న ఏకైక విజయం ఇది. ఇంకా చెప్పాలంటే, క్రాక్ తర్వాత రవితేజ అందుకున్న సక్సెస్ ఇది మాత్రమే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ-డైలాగ్స్ అందించాడు.