తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ ధన్ రాజు క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణ వెనుక చిన్న కారణం ఉంది. ఇటీవల ధనరాజ్ స్కిట్ చేశాడు. ఆ స్కిట్ లో దీపావళి పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీప అనే అమ్మాయి అలీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల దీపావళి అనే పేరు వచ్చిందని కామెంట్ చేశాడు. దీంతో ధనరాజ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధనరాజ్ వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
దీంతో ధనరాజ్ స్పందించాడు. ఇకపై ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటానని దయచేసి అందరూ నన్ను క్షమించాలని కోరారు. కామెడీ కోసం చేశానని పండగను కించపరచాలని కాదని చెప్పుకొచ్చాడు. దయచేసి అందరూ తప్పుగా అర్ధం చేసుకోకండని కోరారు.