వెంకటేష్ కి అమెజాన్ ప్రైమ్ ఊహించని షాక్ - Tolivelugu

వెంకటేష్ కి అమెజాన్ ప్రైమ్ ఊహించని షాక్

రజినీ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా అసురన్. రూరల్ కథగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకోని 150 కోట్లు రాబట్టింది. అసురన్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీని వెంకటేష్ రీమేక్ చేయడానికి రెడి అయ్యాడు. డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు కానీ ఓంకార్ తెరకెక్కించే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అసురన్ రీమేక్ చేసి మంచి యాక్షన్ ఫిల్మ్ చేద్దామనుకున్న వెంకటేష్ కి డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఊహించని షాక్ ఇచ్చింది. 150 కోట్లు రాబట్టిన అసురన్ సరిగ్గా రిలీజ్ అయిన నెల రోజుల్లో ఆన్లైన్ లో దర్శనమిస్తుంది అని ఎవరూ ఊహించి ఉండరు. అసురన్ యూట్యూబ్ లో కానీ పైరసీ లింక్స్ కానీ ఎక్కువగా లేకపోవడంతో, అందరూ అమెజాన్ ప్రైమ్ పై పడ్డారు. రీచబిలిటీ ఎక్కువగా ఉన్న అమెజాన్ ప్రైమ్ లో అసురన్ ప్రత్యక్షమైన కాసేపటికే హెచ్ డి ప్రింట్ బయటకి వచ్చి నెట్ లో హల్చల్ చేస్తోంది. సూపర్ హిట్ టాక్ రాబట్టిన సినిమా కాబట్టి అసురన్ మూవీని చూడడానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమిళ్ వెర్షన్ ని ఎంత ఎక్కువ మంది చూస్తే, వెంకటేష్ చేయనున్న అసురన్ రీమేక్ కి అంత గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp