మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన ధనుష్… ఇప్పటికే తానేంటో తమిళ్ లో నిరూపించుకున్నాడు. బాలీవుడ్ లోనూ అప్పుడప్పుడు మెరుస్తున్న ధనుష్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీపై ఫోకస్ చేశాడు. ఇప్పటికే డైరెక్టర్ శేఖర్ కమ్మలతో సినిమా చేసేందుకు అంగీకరించాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా పట్టాలెక్కనుంది.
డైరెక్టర్ వెంకీ అట్లూరీతోనూ ధనుష్ సినిమాకు గ్రీన్ సిగ్నల వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండగా, మరో రెండు సినిమాలకు ధనుష్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే ధనుష్ కు భారీగా అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా, రైట్ డైరక్టర్ తో పాటు సరైన స్క్రిప్ట్ కోసం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ హంటింగ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.