ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన గుర్తింపు పొందాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. విలక్షణ నటనతో అబ్బురపరిచే ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే.
తాజాగా ధనుష్ బైలింగువల్ సినిమా సార్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ద్విభాష చిత్రంగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతోంది. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి ధనుష్ రేంజ్ ను చూపిస్తోంది. ధనుష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సార్ నిలవడమే కాదు వంద కోట్ల క్లబ్ లో ఎంట్రీ సాధించింది.
ఈ రికార్డు ధనుష్ కు కొత్తేమి కాదు.గతేడాది కూడా తిరుచిత్రంబళం సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. అంతకు ముందు అసున్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఇప్పుడు సార్ తో ఆ కౌంట్ 3 కు చేరుకుంది. విద్యాసంస్థల మీద పోరాటం..సంగీతంతో పాటు సార్ కు పోటీగా ఇంకే పెద్ద సినిమాలు లేకపోవడం ధనుష్ కు బాగా కలిసి వచ్చింది.
ఇప్పటికీ సార్ మంచి కలక్షన్స్ ను అందుకొంటుంది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ధనుష్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.