కోలివుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం ఇప్పటికే కన్ఫామ్ అయింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఆయనతో ఓ సినిమాకు ప్లాన్ చేశారని రివీల్ కూడా చేశారు. అయితే శేఖర్ కమ్ములనేమో సాఫ్ట్ .. ధనష్ ఏమో ఈ మధ్య మాస్ మూవీలు తప్ప మరో జోనర్ టచ్ చేయడం లేదు. దీంతో ఇద్దరి మధ్య ఎలా కుదిరింది? అసలు ఏ స్టోరీ చెప్పి శేఖర్ కమ్ముల ధనుష్‌ని ఒప్పించాడు అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ సమాచారం ప్రకారం.. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందు నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ స్టోరీ ఉంటుందని అంటున్నారు. ఇందులో ధనుష్ మద్రాస్‌కు చెందిన తెలుగు లీడర్‌గా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. పొలిటికల్ స్టోరీని బాగానే డీల్ చేయగలడని ఇప్పటికే లీడర్ మూవీతో నిరూపించుకున్నాడు శేఖర్ కమ్ముల. దీంతో నిజంగా ఇదే స్టోరీ అయినా సరే.. కచ్చితంగా హిట్ కొడతాడని ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.