ఈ మధ్య కాలంలోనే తెలుగు సినిమా స్థాయి విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో మన భాషలో వచ్చే చిత్రాలకు ఇండియా వ్యాప్తంగా భారీ ఆదరణ లభిస్తోంది. ఫలితంగా మన ఫిల్మ్ మేకర్లతో సినిమాలు చేసేందుకు వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ‘సార్’ అనే మూవీని చేశాడు.
తమిళంలో ‘వాతి’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే అందరి దృష్టిలో పడి అంచనాలను భారీగా పెంచుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపకల్పనలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రమే ‘సార్’. ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకుంది.
ఫలితంగా ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో ఈ సినిమా టార్గెట్‌ను చేరుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. థియేటర్లలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే సందడి చేస్తున్న ‘సార్’ మూవీని ఆలస్యంగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని విడుదలైన నెల రోజులకు అంటే మార్చి 17వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ధనూష్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా వేచి చూస్తున్నారు
ధనుష్ నటించిన తాజా చిత్రమే ‘సార్’ (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు.