సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం యుగానికి ఒక్కడు. అయితే ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తమిళ్ లో అయిరతిళ్ ఒరువన్ గా రిలీజ్ కాగా తెలుగులో యుగానికి ఒక్కడు పేరుతో అనువాదం అయింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సీక్వెల్ గా మరో సినిమా రాబోతోంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సెల్వరాఘవన్ అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఇందులో ధనుష్ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన తెలిపారు.
ఇదే విషయంపై దనుష్ స్పందిస్తూ.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కు సంవత్సరాల కాలం పడుతుంది. సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న మా డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుంది. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు మా వంతు కృషి చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు ధనుష్.