ధనుష్ నటిస్తోన్న బై లింగ్యువల్ ప్రాజెక్ట్ ”సార్” . తెలుగు, తమిళ భాషల్లో వస్తుండగా.. తమిళంలో ”వాథి” అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సార్ ట్రైలర్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 8న లాంఛ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఏం టైంలో అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
సార్ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. తనికెళ్లభరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్ తెలుగులో స్ట్రెయిట్‌గా నటిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.