ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం
వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం. జగన్ రెండోసారి సీఎం అవుతారు. ఆయన మళ్లీ సీఎం కాకపోతే నా ఆస్తి మొత్తం రాసిస్తా. ఏపీకి జగన్ లాంటి నాయకుడు మళ్లీ రాలేడు.
జగన్ కు ఎవరూ సాటి రారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరు. ఆయనకు ఆయనే సాటి. అందుకే వచ్చేసారి కూడా జగనే సీఎం అవుతారు. ఈ విషయంలో టీడీపీ నేతలతో కావాలంటే పందెం కాస్తా. ఎవరైనా ముందుకు రావొచ్చు.
ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని జగన్ ఆదేశించారు. అందుకే నేను ప్రతీ ఇంటికి వెళ్తా. మా పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలను అందిస్తున్నాం. మళ్లీ గెలిచేది వైసీపీనే.