ధర్మపురి అరవింద్, బీజేపీ ఎంపీ
మనసుంటే మార్గం ఉంటుంది. కానీ కేసీఆర్ కు మనసు లేదు. లొల్లి అంతా బ్రోకెన్ రైస్ గురించే కదా. దాంతో బ్రాన్ ఆయిల్ తయారైతది.
వ్యాపారులకు రూ.300 చొప్పున మిగులుతుంది. దాన్ని కట్ చేసి ఆ సొమ్ము రైతులకు అందిస్తే సమస్య పరిష్కారమైతది. కానీ సీఎంకు ఆ మనసు లేదు.
లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాడు.. కోవిడ్ టైంలో 82 మంది యువకులను వాడుకుని వదిలేసిండు. 8 ఏండ్ల నుండి ఉద్యోగాలియ్యకుండా ఇప్పుడు మళ్లీ డ్రామాలు చేస్తుండు.
కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి.. భర్తీ చేసేసరికి ఆయన ఉద్యోగమే ఊడిపోతది. ఇది తెలిసి భర్తీ పేరుతో మళ్లా డ్రామా చేస్తుండు.