భారత క్రికెటర్ శిఖర్ ధావన్ 2 సంవత్సరాల తర్వాత తన కుమారుడు జోరావర్‌ను కలిశారు. ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ధావన్ కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆంక్షలు, ప్రోటోకాల్‌ల కారణంగా, 2020 నుండి కొడుకును కలవలేకపోయాడు ధావన్.
జోరావర్ ఆగస్టు 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు.ఇక ఇప్పుడు కొడుకు రావటంతో పట్టరాని సంతోషంలో కొడుకుని పైకెత్తేసాడు ధావన్.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అలాగే ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ (PBKS)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ధావన్.
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన ధావన్ కు కోవిడ్-19 పాజిటివ్ రావటంలో మొదటి రెండు వన్ డే లకు దూరమయ్యాడు. ఇక జూలైలో భారత్ తదుపరి వన్ డే ఆడనుంది. ధావన్ 7 నెలల తర్వాత టీమిండియా జెర్సీ ధరించనున్నాడు.