అనసూయ,నాగబాబు,చమ్మక్ చంద్ర ఇలా జబర్దస్త్ కామెడీ షో కీలక వ్యక్తులంతా జీ తెలుగుకు పయనం కావటంతో జబర్దస్త్ షో డైలమాలో పడింది. అయితే ఈ షాక్ ఇప్పుడు ఢీ డాన్స్ షో కు కూడా తాకినట్లుంది. జబర్దస్త్ లో నాగబాబు-రోజా కాంబినేషన్ ఎలాంటిదో ఢీ షోలో శేఖర్ మాస్టర్-ప్రియమణి కాంబినేషన్ అలాంటిది.
అయితే… ఇప్పుడు ఢీ షో కాంబినేషన్ కు జబర్దస్త్ పంచ్ తగిలినట్లుంది. శేఖర్ మాస్టర్ కూడా జీ తెలుగుకు వెళ్లిపోవటమే ఇందుకు కారణం. ఢీ యాంకర్స్ ప్రదీప్, రవి ఇప్పటికే వెళ్లిపోగా… శేఖర్ మాస్టర్ కూడా ఫాలో అయ్యారని టాక్.
జబర్దస్త్, ఢీ షో లకు అంతటి రేటింగ్ రావటంలో కీలకపాత్ర పోషించిన జడ్జిలు, కంటెస్టెంట్లు ఇప్పుడు మళ్ళీ స్థాయిలో ఆకట్టుకుంటారో లేదో చూడాలి.