మహేంద్రసింగ్ ధోనీ గురించి ఇండియన్స్ కు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆటగాడిగా, కెప్టెన్ గా టీమిండియా కు ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు ధోనీ. అయితే ధోనీ ఓ వైపు క్రికెట్ ఆడుతూనే…ఇతర రంగాలలో కూడా యాక్టివ్ గా ఉండేవాడు.
అయితే తాజాగా ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. అదే అధర్వ అవతారం. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇందులో ధోనీ రాజు గెటప్ లో కత్తి పట్టుకొని కనిపించాడు.
అయితే ఇది చూసిన అభిమానులు మొదట సినిమా అని అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే తమిళ సంగీత దర్శకుడు రమేష్ తమిళ్‌మణి రచిస్తున్న గ్రాఫిక్ నవల అధర్వ: ది ఆరిజిన్. ఇందులో ధోని హీరో పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇది కేవలం గ్రాఫిక్ నవల మాత్రమే. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇక త్వరలో అమెజాన్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది. ప్రీ-ఆర్డర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం కల్నిపించారు. విర్జూ స్టూడియోస్, మిడాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి ఈ గ్రాఫిక్ నవల విడుదల కనూంది.
అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ పై ధోనీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌తో కలిసినందుకు నేను చాలా థ్రిల్ అవుతున్నాను. ఇది నిజంగా అద్భుతమైన వెంచర్. ఆకర్షణీయమైన కథ, ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల అంటూ చెప్పుకొచ్చారు.
Advertisements