ధోనీ, ఆయన భార్య సాక్షి కలిపి స్థాపించిన నిర్మాణ సంస్థ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి సినిమా ‘ఎల్‌జీఎం’. లెట్స్ గెట్ మ్యారీడ్ అనేది దీని అర్థం. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సాక్షితో పాటు పలువురు ప్రముఖులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
‘లెట్స్ గెట్ మ్యారేడ్’ నూతన దర్శకుడు రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి కాన్సెప్ట్ తో స్వయంగా రూపొందిస్తున్నారు. ఇందులో నటులు హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.
విశ్వజిత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ తమిళమణి సంగీతం కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది. సినిమా స్క్రిప్టు కాన్సెప్ట్‌ను రూపొందించిన సాక్షి ధోని సినిమా ప్రారంభం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.