ఈ మధ్య దొంగలు చాలా తెలివి మిరిపోతున్నారు. దొంగతనం చేసిన వారు పోకుండా కొన్ని అతి తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ఇది సినిమాల ప్రభావం కూడా కావచ్చు. ఎందుకంటే మొన్న ఆ మధ్య కాలంలో వచ్చిన హృతిక్ రోషన్ చిత్రం ధూమ్ లో మాదిరిగా పోలీసులకు సవాలు చేశారు. అది ఏంటంటే చేతనైతే మమ్మల్ని పట్టుకోండంటూ పోలీసులకే సవాల్ విసిరారు.
పూర్తి వివరాల ప్రకారం… ఒడిశాలోని నవరంగ్ జిల్లాలోని ఇంద్రావతి ఉన్నత పాఠశాలలో దొంగలు పడి కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మెషిన్లు, ఫొటో కాపీయర్స్, వేయింగ్ మెషిన్లను ఎత్తుకుపోయారు. అంతటితో ఆగకుండా కొన్ని సెల్ ఫోన్ నంబర్లను కూడా బోర్డుపై రాసి వెళ్లారు. అంతే కాకుండా చేతనైతే మమ్మల్ని పట్టుకోండంటూ సవాల్ చేశారు. అంతే కాకుండా ధూమ్ 4 తొందర్లో వస్తుందని రాసి వెళ్లారు.
అయితే సోమవారం ఉదయం స్కూల్ కి వచ్చిన ప్యూన్.. హెడ్ మాస్టర్ రూమ్ డోర్ తెరిచి ఉండటాన్ని గుర్తించాడు. అందులో కొన్ని వస్తువులు లేకపోవడాన్ని గమనించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్ హెచ్ఎం సర్వేశ్వర్ బెహెరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.