చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ఆదిత్య వర్మ. మన అర్జున్ రెడ్డికి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి ముందుగా బాలా దర్శకత్వం వహించాడు. ప్రొమోషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఇక రిలీజ్ అవ్వడమే లేట్ అనుకుంటున్న టైములో ఆదిత్య వర్మ ఆగిపోయింది. దర్శకుడు బాలాని, హీరోయిన్ ని, చిత్ర యూనిట్ మొత్తాన్ని మార్చేసిన విక్రమ్, ఆదిత్య వర్మని కొత్తగా షూట్ చేయించాడు. సందీప్ రెడ్డి వంగ శిష్యుడు గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య వర్మ కొత్త వెర్షన్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. నవంబర్ 8న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఆదిత్య వర్మ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
కళ్లు మూసుకోని ఆదిత్య వర్మ ట్రైలర్ ని వింటే, ఇది అర్జున్ కదా అనిపించకమానదు. గిరీశయ్య అంత మక్కికి మక్కి అర్జున్ రెడ్డిని దించేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సీన్స్, డైలాగ్స్ ఒక్కటేమిటి ప్రతి విషయంలో ఆదిత్య వర్మ, అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తూనే ఉంది. విజయ్ దేవరకొండని ఇక్కడ హీరోగా నిలబెట్టిన అర్జున్ రెడ్డి, ధృవ్ విక్రమ్ హీరోగా ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి. అర్జున్ రెడ్డి ఫ్లేవర్ అలానే ఉంచి, యాజ్ ఇట్ ఈజ్ గా తమిళ్ కి మార్చిన చిత్ర యూనిట్ సక్సస్ అందుకోవడానికి రెడీ అయ్యింది.