సెలబ్రిటీల విషయంలో ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం ఇలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. తాజాగా మరో నటి అదే జాబితాలో చేరింది. కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా లో నటించిన దియా మీర్జా బిజినెస్ మాన్ వైభవ్ రాఖీని రెండో వివాహం చేసుకుంది.
అతి తక్కువ మంది సన్నిహితులు బంధువుల మధ్య ఈ వివాహం జరిగింది.కాగా ఈ కార్యక్రమానికి కి జానకి భగ్నాని,అతిథి రావు హైదరి, గౌతమ్ గుప్తా హాజరయ్యారు. దియా వైభవ్ లకు ఇది రెండో పెళ్లి. 2014లో ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను దియా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకుని దియా వార్తల్లో నిలిచింది.