అప్పట్లో అక్కినేని, ఎన్టీఆర్ ఇద్దరికీ మంచి క్రేజ్ ఉండేది. వారి సినిమాలు చూడటానికి జనాలు క్యూ కట్టేవారు. ఎంత మంది హీరోలు వచ్చినా సరే అప్పట్లో వారికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఇద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాలు చేసారు. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎవరూ చేయని పాత్రలు చేసారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేసేవారు కాదు.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేవారు. అప్పట్లో ఎన్టీఆర్ కంటే అక్కినేని కామెడి బాగా చేసేవారు అని అంటారు. తన సినిమాల్లో ఆయన అడిగి మరీ కామెడి ఉండేలా చూసుకునేవారు అని అంటారు. మిస్సమ్మ, దేవదాస్ వంటి సినిమాల్లో ఆయన కామెడి బాగా పండింది అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన కావాలనే కామెడి సన్నివేశాలు పెట్టించారు అని చెప్తారు. దేవదాస్ సీరియస్ పాత్రే అయినా ఆయన కామెడి చేసిన తర్వాత బాగా నచ్చింది.
ఇక మిస్సమ్మ సినిమా విషయానికి వస్తే… కమెడియన్ తరహా… డిటెక్టీవ్ పాత్రను కావాలనే పెట్టించారట. నిర్మాత నో చెప్పినా సరే అక్కినేని మాత్రం తగ్గలేదు. దీనితో దర్శకుడు ఆ సీన్స్ చేయించారు. సావిత్రి దగ్గర సంగీతం నేర్చుకునే సన్నివేశంలో, పేపర్ లో యాడ్ ఇవ్వడం కోసం అక్కినేని చిరునామా చెప్తారు. ఆ సన్నివేశం చాలా బాగా పండింది అప్పట్లో.