మన సౌత్ లో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న నటుల్లో అర్జున్ దాస్ ఒకడు. ఖైదీ సినిమాలో లైఫ్ టైం సెటిల్ మెంట్ అనే డైలాగ్ తో అతనికి మంచి డిమాండ్ వచ్చింది. తమిళంలో మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఆ సినిమాలో నెగటివ్ రోల్ అయినా సరే అర్జున్ దాస్ నటన చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ప్రస్తుతం మన తెలుగులో అతనికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.
Also Read:ప్రేమించిన అమ్మాయి పేరుతో సినిమా తీసిన వర్మ…!
అర్జున్ దాస్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా అతని వాయిస్ కు ఫాన్స్ ఎక్కువ. యూట్యూబ్ లో అతని వీడియో లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. మాస్టర్ సినిమాలో నటనకు మంచి మార్కులు పడిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. విక్రం సినిమా క్లైమాక్స్ లో కూడా కనిపించాడు ఈ యువ నటుడు. అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో చూద్దాం.
చెన్నై లో 1990లో పుట్టిన అర్జున్ దాస్… చదువు విషయంలో సీరియస్ గా ఉండేవాడు. నటన అంటే కూడా అతనికి ఇష్టమే. అయితే ఆర్ధిక పరిస్థితుల కారణంతో జాబ్ లో జాయిన్ అయ్యాడు. దుబాయి లో మంచి బ్యాంకు జాబ్ లో జాయిన్ అయ్యాడు. లక్షల్లో జీతం వస్తున్నా సరే జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చాడు.
పెరుమాన్ అనే సినిమాలో ముందు అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కాని షార్ట్ ఫిలింలో నటించి ఖైదీ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. సినిమాల్లోకి వచ్చినప్పుడు బాగా బరువు ఉన్న అర్జున్ దాస్ తర్వాత 32 కేజీలు తగ్గాడు. ఇప్పుడు స్లిమ్ గా తయారయ్యాడు.
Also Read:మోర్బీ ఘటనపై నీళ్లు నములుతున్న గుజరాత్