టాలీవుడ్ లో సమంతా నాగ చైతన్యకు సంబంధించి గత మూడు నాలుగు నెలల నుంచి సోషల్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. వీళ్ళ వైవాహిక జీవితం విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఉత్కంట అందరిలో కొనసాగింది రెండు నెలల క్రితం వరకు. ట్విట్టర్ లో సమంతా పేరు తొలగించడం ఆ తర్వాత వీళ్ళు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరగడం అనూహ్యంగా అది నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన చేయడంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే ఇప్పుడు సమంతా కారణంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందనే ప్రచారం ఎక్కువగా ఉంది. ఒక వెబ్ సీరీస్ లో సమంతా నటనే గొడవకు దారి తీసిందని అంటున్నారు. 2018లో, వారి వివాహం జరిగిన కొద్ది నెలలకే, సమంత ‘రంగస్థలం’లో రామ్ చరణ్‌తో లిప్-లాక్ ఇవ్వడం వివాదాస్పదం అయింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత సెక్స్ సీన్ లో నటించిన తర్వాత విభేదాలు మరింత తీవ్రం అయ్యాయని, ఆ సన్నివేశం అక్కినేని ఫ్యామిలీని పరువు తీసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంతా సెక్స్ సీన్‌ని చూసి నాగ చైతన్య మరియు అతని కుటుంబం పూర్తిగా షాక్‌కు గురయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. వెబ్ సిరీస్‌లో తన బోల్డ్ సన్నివేశం గురించి కుటుంబ సభ్యులకు ముందుగా ఆమె చెప్పలేదని అంటున్నారు. దీనికి సంబంధించి కుటుంబంలో చర్చ కూడా జరిగిందని అయితే సమంతా ఇచ్చిన వివరణ తో అక్కినేని ఫ్యామిలీ సంతృప్తి చెందలేదని జాతీయ మీడియా వెల్లడించింది.