వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్ ని అందుకున్నాడు. ప్రస్తుతం థాంక్యూ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇటీవల టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ లో నాగ చైతన్య చెప్పిన కొన్ని డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతేకాకుండా చైతు చెప్పిన డైలాగ్స్ సమంతను ఉద్దేశించి చెప్పేటట్టు ఉందని కొంతమందిని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎవరో తెలుసా?
నిజానికి ఈ ఇద్దరూ విడిపోయిన తర్వాత నాగచైతన్య సమంత గురించి ఎక్కడా డైరెక్ట్ గా ప్రస్తావించలేదు. కానీ సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా చైతును ఉద్దేశిస్తూ కొన్ని పోస్టులు పెట్టింది.
ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?
ఇక టీజర్ లో చైతన్య మాట్లాడుతూ ఎన్నో వదులుకొని వచ్చాను నా సక్సెస్ కు నేనే కారణమంటు చెబుతాడు. ఆ డైలాగ్ నాగచైతన్య నిజ జీవితానికి కూడా దగ్గరగా ఉండటం గమనార్హం. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.