ఆల్‌ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి హతమయ్యారు. కాబూల్‌లో అతన్ని అమెరికా సేనలు మట్టుపెట్టాయి. అత్యంత రహస్యంగా ఆల్ ఖైదా చీఫ్ ను టార్గెట్ చేసి అమెరికా సేనలు హతమార్చినట్టు తెలుస్తోంది.

ఈ మిస్సైల్ లో రేజర్ లాంటి బ్లేడ్లు ఉంటాయని, ఎలాంటి బ్లాస్ట్ జరగకుండానే లక్ష్యాన్ని ఛేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మిస్సైల్ ను ఉపయోగించినప్పుడు తక్కువ మరణాలు సంభవిస్తాయి.
అల్ జవహరిని హతమార్చేందుకు ఆర్9ఎక్స్ మిస్సైల్‌ను ఉపయోగించినట్టు అటు పెంటగాన్ కానీ, ఇటు సీఐఏ కానీ వెల్లడించలేదు. కానీ హై ప్రొఫైల్ వున్న తీవ్రవాద నేతల్ని టార్గెట్ చేసి హత మార్చే సమయంలో ఇలాంటి ఆయుధాలను వాడుతారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
2017లో ఈ ఆయుధాన్ని తొలిసారిగా వాడారు. ఆల్ ఖైదా సీనియర్ నేత అల్ మాస్రిను తన కారులో వెలుతుండగా దానిపై ఈ మిస్సైల్ ను ప్రయోగించారు.
ఈ ఆయుధం అత్యం ఆధునికమైనదని, దీనితో లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో పేలుడు పదార్ధాలకు బదులుగా వెడల్పు ఉన్న బ్లేడ్లు ఉంటాయి. వీటి వల్ల బిల్డింగ్ లోకి కూడా ఇవి చొచ్చుకుని పోగలవు.
కొన్ని సార్లు వీటిని డ్రోన్ల ద్వారా కూడా ప్రయోగిస్తారు. ఫ్లయింగ్ గిన్సు గా పిలవబడే వీటిని జపాన్ కిచెన్ కత్తులతో పోలుస్తారు. వీటికి అల్యూమినియం క్యాన్లను సైతం కట్ చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటికే నింజా బాంబ్ అని మరో పేరు.
గతనెల 31న కాబూల్ లో తన నివాసంలో బాల్కనీలో ఒంటరిగా నిలుచున్న అల్ జవహరిపై రెండు హెల్‌ఫైర్స్‌తో అటాక్ చేసినట్లు తెలుస్తోంది. అల్‌జవహరి నివాసంలో ఓ వైపు భాగంలో కిటికీలు పగిలిపోయాయి. మరో వైపు మాత్రం అంతా సాధారణంగానే ఉంది. ఈ దాడి సమయంలో జవహరి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారని, కానీ వారిలో ఏ ఒక్కరినీ టార్గెట్ చేయలేదని అధికారులు తెలిపారు.