కరోనా వైరస్ ను ”డెటాల్ ”సమర్ధవంతంగా నాశనం చేస్తుందని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెటాల్ ఏయే సూక్ష క్రిములను నాశనం చేస్తుందో తెలియజేస్తూ బాటిల్ పై ఉన్న సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బాటిల్ పై ఉన్న ఇన్ స్ట్రక్షన్స్ లో ఇ కొలై, సామ్మోనెల్ల, ఎం.ఆర్.ఎస్.ఎ, రోటావైరస్, ప్లూవైరస్, కోల్డ్ వైరస్ (హ్యూమన్ కరోనా వైరస్, ఆర్.ఎస్.వి) వంటి ఇతర బ్యాక్టీరియాను డెటాల్ నాశనం చేస్తుందని ఉంది. ఈ విషయం నిజమా..? లేక తప్పుడు సమాచారమా అనేది స్పష్టంగా తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇదే సమయంలో 2019 డిసెంబర్ లో మొదటిసారిగా కనుగొన్న కరోనా వైరస్ గురించి డెటాల్ కు ముందే ఎలా తెలిసిందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై డెటాల్ ఉత్పత్తి దారులైన బ్రిటీష్ కంపెనీ రెకెట్ బెనిక్సర్ స్పందిస్తూ కొత్త రకం కరోనా వైరస్ గురించి మేము ఇంకా పరీక్షించలేదు. అది మాకు అందుబాటులో లేదని తెలిపింది. అయితే 2019 డిసెంబర్లో చైనా వుహాన్ లో మొదట కనుగొన్న ఎన్.కరోనా వైరస్ ను డెటాల్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు ధీమాగా చెప్పారు.డెటాల్ అనేది యాంటిసెప్టిక్. శరీరానికి, ఇంటి ప్లోరింగ్ లో సూక్ష్మ క్రిమినాశినిగా వాడతారు. అయితే 2019 అక్టోబర్ లో ఉత్పత్తి అయిన డెటాల్ బాటిల్ పైన ఈ విషం ఉండడంతో డెటాల్ కు కరోనా వైరస్ గురించి ముందే ఎలా తెలిసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా వైరస్ అంటే ఏమిటి..?
మనుషులకు, క్షీరదాలకు సోకే ఒక కుటుంబానికి చెందిన వైరస్ ను కరోనా వైరస్ అంటారు. అయితే కరోనా వైరస్ అంటే ఇటీవల చైనా లోని వుహాన్ లో దాదాపు 500 మందిని బలితీసుకున్న వైరస్ ఒక్కటే కాదు. కరోనా వైరస్ అంటే కొన్ని వైరస్ ల కుటుంబం. ఇందులో చాలా రకాలుంటాయి. ఒక్కో దానికి ఒక్కో పేరు పెడతారు. ప్రస్తుతం వ్యాపిస్తోన్న కరోనా వైరస్ పేరు 2019-నోవెల్ కరోనా వైరస్. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇటీవల చైనాలోని వుహాన్ లో వ్యాపించిన 2019-nCoV (2019 నోవెల్ కరోనా వైరస్) గతంలోని కరోనా వైరస్ జన్యు లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయి. వాటిని ఇంకా గుర్తించాల్సి ఉంది. 2019 నోవెల్ కరోనా వైరస్ కుటుంబానికి చెందిన పాత వైరస్ ను డెటాల్ 99 శాతం సమర్ధవంతంగా ఎదుర్కొందని డెటాల్ కంపెనీ తెలిపింది. అయితే 2019-నోవెల్ కరోనా వైరస్ ను తాము ఇంకా పరీక్షించనందున ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. సబ్బు, నీళ్లు, సూక్ష్మక్రిమిసంహారక ద్రావణాలతో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది.