తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు మీద కూడా ఫోకస్ చేసి డైరెక్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన సార్ అనే సినిమా మంచి హిట్ అయింది. ఈ మధ్య కాలంలో ధనుష్ తన భార్యకు దూరంగా ఉండి విడాకులు ఇవ్వడం కాస్త సంచలనం అయింది. ఎవరు రాజీ చేసినా ధనుష్ వెనక్కు తగ్గలేదు.
ఇక ఇప్పుడు ధనుష్ చెన్నైలో కొన్న ఒక ఇల్లు హాట్ టాపిక్ అయింది. రెండేళ్ళ క్రితం ధనుష్ ఒక స్థలం కొన్నారు. అగ్ర నటులు ఉండే నివాస ప్రాంతంలో ఆయన ఆ స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. అప్పటికి భార్యతో ఏ విభేదాలు లేవు. ఆమె భూమి పూజ కూడా చేసి ఇంటి నిర్మాణంకు అడుగులు వేసారు. కాని అనూహ్యంగా ఇద్దరూ విడాకులు తీసుకుని దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ ఇంటి నిర్మాణ ఖర్చు వంద కోట్లకు పైగానే ఉంది అని సమాచారం. భార్యకు విడాకులు ఇవ్వడంతో తన తల్లి తండ్రులతో కలిసి ధనుష్ ఇంటి గృహ ప్రవేశం చేసారు. ఈ ఇంటి కోసం అంత ఖర్చు చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని, చెన్నైలో ఇది అత్యంత ఖరీదైన ఇళ్ళలో ఒకటి అని అంటున్నారు. భార్యతో కలిసి ఉండాలని అనుకున్నాడు అని కాని అది సాధ్యం కాలేదని అంటున్నారు.