తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ విభేదాలతో కాస్త ఇబ్బంది పడిన ధనుష్ కథల విషయంలో సీరియస్ గా ఫోకస్ చేయలేదు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కెరీర్ మీద మరింత సీరియస్ గా ఫోకస్ చేసి ధనుష్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే తెలుగులో కూడా ఒక సినిమా ధనుష్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి ఒక సినిమాను బాలీవుడ్ లో కూడా చేస్తాడని సమాచారం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు ధనుష్ నటించిన సార్ అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమా విషయంలో ధనుష్ కాస్త జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రమోషన్ కూడా సీరియస్ గానే చేసాడు.
ఇక ఈ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గానే విడుదల అయింది. ప్రమోషన్స్ కోసం ధనుష్ రెండు సార్లు హైదరాబాద్ కు రావడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇలా ప్రమోషన్ చేయడానికి ధనుష్ 50 లక్షలు అదనంగా తీసుకున్నారు అని సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ధనుష్ ఫాన్స్ మాత్రం ఇది నిజం కాదని అంటున్నారు. కాగా ఈ సినిమా కోసం ధనుష్ రెండు వారాలకు పైగా ప్రచారం చేసాడు.