మాములుగా సినిమాల్లో నటించే వాళ్ళు సన్నగా, నాజూగ్గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళను సినిమాల్లోకి తీసుకోవడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కాని కొందరు మాత్రం లావుగా ఉన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం సినిమాల్లో కనుమరుగు అయిపోయారు. హీరో వినాయకుడు, ఆ తర్వాత గీతా సింగ్ వంటి వాళ్ళను పెద్దగా ఆదరించలేదు.
గీతా సింగ్… కితకితలు సినిమాతో సందడి చేసింది. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆమెకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఏదో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసింది. ఇక పరిశ్రమలో ఆమె బాడి షేమింగ్ కామెంట్స్ బాగానే ఎదుర్కొంది. ఇక స్టార్ కమెడియన్ అయితే ఆమెను మరింత దారుణంగా కామెంట్ చేసారట. ఒక సందర్భంలో గీతా సింగ్ ను అవమానించారట.
మంచం మీద పడుకోమని చెప్పి… ఆమె పడుకున్న తర్వాత చూడు ఈ బెడ్ పై నువ్వే సరిపోయావు .. మరి నీ పార్టనర్ ఎలా పడుకోగలరు.. పెళ్లి మాత్రం చేసుకోవద్దు అన్నారట. దీనితో బోరున ఏడ్చిన ఆమె… ఆ తర్వాత అవమానం గురించి చాలా మందికి చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇక అక్కడి నుంచి అవకాశాలు కూడా బాగా తగ్గాయట. ఇంత లావుగా ఉన్న అమ్మాయిని కమెడియన్ గా పెట్టాల్సిన అవసరం ఏంటని కొందరు అనేవారట