మన తెలుగులో కొన్ని సినిమాలు ఎన్నేళ్ళు గడిచినా సరే అలా గుర్తుంటాయి అనే మాట వాస్తవం. అందులో అంతఃపురం సినిమా ఒకటి. ఈ సినిమా కథ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. అప్పటి వరకు ఏ సినిమాలో చూపించని ప్రకృతి సన్నివేశాలను కృష్ణ వంశీ ఈ సినిమా ద్వారా చూపించారు. విమర్శకులు సైతం కృష్ణ వంశీ పని తీరుకి ఫిదా అయ్యారు అనే మాట వాస్తవం.
ఈ సినిమాలో సౌందర్య, ప్రకాష్ రాజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక సాయి కుమార్, శారద కూడా చాలా బాగా నటించి మెప్పించారు. కథ కూడా ఆ రేంజ్ లో ఉండటంతో సినిమా ఆకట్టుకుంది. ఇక అసలేం గుర్తుకు రాదూ అనే పాట ఇప్పటికి కూడా ప్రేక్షకులకు గుర్తుంది. ఇదిలా ఉంచితే ఈ సినిమాకు ముందు సౌందర్య కంటే వేరే హీరోయిన్ ని అనుకున్నారు కృష్ణ వంశీ.
బాంబే హీరోయిన్ మాధురి దీక్షిత్ ని తీసుకోవాలని ఆయన ప్లాన్ చేసారు. ఆమెకు కథ కూడా చెప్పారు. కాని ఈ సినిమాను పర్యవేక్షిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ పట్టుబట్టి మరీ సౌందర్య కావాలని చెప్పారు. నిర్మాత జెమిని కిరణ్ కు కూడా ఇదే విషయాన్ని ఆయన గట్టిగా చెప్పారట. దీనితో కృష్ణ వంశీ మరో ఆలోచన లేకుండా ఆమెను తీసుకున్నారు. సౌందర్య మినహా ఎవరు చేసినా సినిమా ఫ్లాప్ అనేలా ఆమె నటించారు.